గురువారం 12 మార్చి 2009

ఇండియన్ యూత్ పవర్


ఇండియన్ యువత
I . మాకు రాజకీయ పాలకులు వద్దు రాజకీయ సేవకులు కావాలి.
ఒకటి :- రాజకీయం అంటే పొలిటికల్ బిజినెస్ కాదు, అసెంబ్లీకి వెల్లవలసినది ప్యాక్షనిస్టులు, మాపియాడాన్లు, రౌడీలు , గూండాలు ,కాదు. స్వచ్ఛమైన ప్రజా సేవకులు వెళ్ళాలి.
రాజకీయాలు మారాలి పేదవాడు , అణగారిన కులస్తులు సైతం రాజకీయాలలోకి వచ్చి ప్రజా సమస్యలు తీర్చే స్వచ్ఛమైన ప్రజా రాజకీయ సేవకులుగా అసెంబ్లీ లో అడుగుపెట్టి ప్రజా సమస్యలు చర్చించే పవిత్రమైన దేవాలయం గా అసెంబ్లీని తీర్చి దిద్దే రాజకీయ సేవకులు కావాలి మాకు.
ప్రస్తుత మన దేశ రాజకీయ వ్యవస్థలో ప్యాక్షనిస్టులు,మాపియాలతో సంభందాలు పెట్టుకున్న నాయకులు, గూండాలు ,రౌడీలు ,ముక్కుపచ్చలారని చిన్నపిల్లల జీవితాలతో వ్యభిచార గృహాలు నడిపే కొందరు కంత్రి స్త్రీలు , దేశాన్ని దోసుకునే పొలిటికల్ గజ దొంగలు ,మాత్రమే రాజకీయాలలో వుంటున్నారు .
ప్రజలకు సేవచేయాలి అని బావించే కొద్దిపాటి రాజకీయ నాయకులను అనగదోక్కుతున్నారు మనరాజకీయ వ్యవస్త అంత దారుణం గా తాయారు అయ్యింది .
అసెంబ్లీ అనే పవిత్రమైన దేవాలయం ఈ పొలిటికల్ గజదొంగల ప్యాక్షనిస్టులు ,మాపియా ,గూండాలకు ప్రజా సమస్యలు గూర్చి చర్చించే పవిత్రమైన దేవాలయం లా కాక , సవాళ్ళు ,కత్తులు దూసుకునే అడ్డాగా ఈపాలకులు మార్చేచారు .
అసెంబ్లీ లో స్పీకర్ లు ,గవర్నర్లు అధికార పార్టీలకు వత్తాసుపలికే యదవలుగా మారారు.
రెండు :- బ్లాక్ మెయిలింగు మీడియా ,కొన్ని పార్టీలకు వత్తాసు పలికే మీడియా మాకు వద్దు .
నిస్వార్ధంగా ప్రజా సమస్యలు గూర్చి దేశం లో జరుగుతున్న అవినీతి అక్రమాలు,తప్పు చేచిన వాడిని ప్రస్న్నిచే ఒక న్యాయ దేవతలా వ్యవహరించే మీడియా కావాలి ,నిజాలను నిర్బయం గా రాసే మరియు చూపే దమ్మున్న మీడియా మా యువతకు కావాలి .
మీడియా :- ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో మీడియా సంస్థ సపోర్ట్ చేస్తూ మీడియా కూడా రాజకీయ వ్యాపారం చేస్తుంది , రాజకీయ నాయకులు ప్రజల సొమ్ము దోసుకుతినే గజ దొంగలు అయితే మీడియా ఆయా రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ రాజకీయ నాయకులు వద్ద మరియు తప్పు చేసి తప్పించుకోవాలి అని చూచే యదవలు వద్ద బ్లాక్ మెయిలింగు బిజినెస్ చేస్తూ మీడియా ఎం. డీ లు కోట్లకు పడగలెత్తుతున్నారు .
సినిమా పత్రికలవారు :- కొన్ని సినిమా పత్రికలవారు వారి స్వలాబం కోసం హీరోల అభిమానులు మద్య గొడవలు సృష్టించే రాతలు వ్రాయటం ,అక్రమ సంబంధాలు అంటగట్టటం ,పాలనా హీరోకి ,హీరోకి మద్య కోల్డ్ వార్ నడుస్తుంది అంటు ప్రసారం చేసి అభిమానులు మద్య విద్వేషాలు సృష్టించటం పైగా ,పిలిం నగర్లో ఈ విషయాలు వీర విహారం చేస్తున్నాయి అంటు లాస్ట్ లో రెండు ముక్కలు వ్రాసి ఎవరుమీదో తోసేసే పద్ధతిని అవలంబించే సినిమా మ్యాగాజైన్స్ ని అరికట్టే చట్టం వ్రావాలి , ఆ పత్రికలు వ్రాసేవి నిజాలు అయితే సాక్ష్యా దారాలుతో సహా ముద్రించండి ,అప్పుడు ఆయా మ్యగాజైనలకి విలువలు వున్నాయి అని యువత నమ్ముతుంది విలువలులేని పత్రికలని ,మీడియాని ,రాజకీయ నాయకులను మన ఇండియన్ యువత సీధరించుకుంటుంది .
వార్ :- రాజకీయాలూ ప్యాక్షనిస్టులుకు శత్రువులను అంతం చేసే వజ్రాయుధం గా మారి పోయాయి పొలిచి వ్యవస్థ మరియు గవర్నమెంట్ ఉద్యోగ వ్యవస్త అధికార పార్టీ చేతిలో , ఒక తోలు బొమ్మల తాయారు అయింది
కుల నాయకుల స్వార్ధ రాజకీయాలూ :- కులాల పేరుతో కుల రాజకీయాలూ చేస్తూ కుల నాయకులు కోట్లుకు పడగలెత్తుతున్నారు . కులాలకు మంచి చేస్తునట్లు పైకి నటిస్తూ కులనాయకులు వెనక తిరిగే అమాయక యువకులు మరణిస్తున్నారు .ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇప్పుడు వున్న కులనాయకులు ఆయా కుల ప్రజలకు వారు ఏమి సాదిన్చారో ఒక్క సారి మనం గుండెలు మీద చేయి వేసుకుని ఆలోచిస్తే మనకు అర్ధం అయిద్ధి మన కులనయకులు వల్ల మనకు మంచి జరగటం అనేది వుండదు .ఈ స్వార్ధ కుల నాయకులను తరిమి కొడదాం ?
యువ శక్తి

ఈ వ్యవస్థ మారాలి , ఈ వ్యవస్థ ను మార్చే యువ శక్తి రాజకీయాలలోకి ప్రవేచించాలి . దేశ బవిస్యత్ ని తీర్చి దిద్దే యువ సైన్యం లో ప్రతి ఒక్క ఇండియన్ పాలు పంచుకోవాలి .
జైహింద్ ఇండియన్ యువత